రాయపర్తి/అక్టోబర్ 11 (జర్నలిస్ట్ వార్త): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కోలన్‌పల్లి గ్రామానికి చెందిన గాజుల దివ్య ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో, ఆమె కుటుంబానికి ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దివ్య చిత్రపటానికి నివాళులర్పించి, ఫౌండేషన్ తరఫున 50 కిలోల బియ్యం, నూనె క్యాన్‌తో పాటు రూ.2 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, కర్ర రవీందర్‌రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్‌గౌడ్, వంగళ నర్సయ్య, చిట్యాల వెంకన్న, చందు రామ్, పుల్ల ఎల్లగౌడ్, తోట నర్సింగం, సంకినేని ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.