రాయపర్తి/అక్టోబర్ 11 (జర్నలిస్ట్ వార్త): మండలంలోని బంధనపెల్లి గ్రామ ఎస్సీ కాలనీలో బొడ్డెమ్మ వేడుకలు నిర్వహించుకునేందుకు స్థానిక మహిళల విజ్ఞప్తి మేరకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి డీజే సౌండ్ బాక్స్ సెట్‌ను అందజేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు ఈ సహాయం చేసినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. డీజే బాక్స్ సెట్‌ను రాయపర్తి మండల బీఆర్ఎస్ నాయకులు లేతకుల రంగారెడ్డి, సంకినేని ఎల్లస్వామి మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూక్యా దీప్లా, ఉపసర్పంచ్ మంద అశోక్, వార్డు సభ్యులు డెక్కదేవ కొన్నె ప్రవీణ, గుగులోత్ వాలు, మాసం రమేశ్, గాడ్డే మోహన్, డెక్క యోసోబ్, బర్ల రామచందు, డెక్క కుమార్, బర్ల శ్రీను, కొండేటి యాకయ్య, డెక్క నవీన్, చిర్ర రాజు, బర్ల శ్రీకాంత్, మంద భాస్కర్, డెక్క రాజు, డెక్క సునీల్, డెక్క రాగులు, మంద ఎల్లయ్య, డెక్క అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
బొడ్డెమ్మ వేడుకలకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ డీజే బాక్స్
By -
October 11, 2026