వరంగల్ బ్యూరో /అక్టోబర్ 2 (జర్నలిస్ట్ వార్త): జర్నలిస్టుల హక్కులు, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని టీయూడబ్ల్యూజె(ఐజేయూ) జాతీయ కౌన్సిల్ సభ్యుడు సంగోజు రవి కోరారు. ‘పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ దినం’లో భాగంగా గురువారం గ్రేటర్ వరంగల్ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీరాం రాంచందర్, ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్, కందుల శ్రీధర్, జన్ను స్వామి తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వాల దృష్టి ఏదీ?
By -
October 02, 2026