వేలేరు/అక్టోబర్ 11 (జర్నలిస్ట్ వార్త):
వేలేరు మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ పూజలు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ దుర్గమ్మ దీవెనలు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలందరిపై దుర్గామాత కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీనివాస్, సురేష్, శ్రీనివాస్, భరత్, కిరణ్, మహేష్, వేద పండితులు, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.