వర్ధన్నపేట/జనవరి19 (జర్నలిస్ట్ వార్త);బీ.ఆర్.ఎస్ నాయకులవి ఎన్నికల డ్రామాలని, యువజన కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, మండల ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ
వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికలు వస్తే తప్ప బయటకు రాని వ్యవస్థ బీ.ఆర్.ఎస్ నాయకత్వంలో నే కాదు గ్రామస్థాయి నాయకులకు పాకిందని అందుకే ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ప్రజలకు తప్పుడు ప్రచారాలను చేరవేయడమే పనిగా పెట్టుకొని ప్రెస్ మీట్ లు పెట్టడం అనవసర ప్రకటనలు చేసి నానాటికి మరింత దిగజారి పోతున్నారని కుల్ల యాకాంతం అన్నారు. బీఆర్ఎస్ నాయకులు వర్ధన్నపేట అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ని చర్చకు సిద్ధమా అంటూ ప్రకటించిన ప్రకటనపై స్పందింస్తూ రాష్ట్రంలో గత 10 ఏండ్లు నిరంకుశ పాలన భరించిన ప్రజలు కోలుకోని దెబ్బతీసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బీఆర్ఎన్ నాయకులకు బుద్ధి రావడం లేదని యాకాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చిత్తశుద్ధితో తనపై నియోజకవర్గ ప్రజలు 'పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తున్నారన్నారు. కేవలం ఈ ప్రాంత అభివృద్ధిని మాత్రమే కాంక్షించే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మీలా ఎన్నికల డ్రామాలు చేయకుండా కేవలం అభివృద్ధి మీదే దృష్టి పెట్టారు కాబట్టే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రధానంగా సామాన్యుల చిరకాల కోరిక అయిన పక్కా ఇండ్ల నిర్మాణం ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అన్ని వర్గాల్లో సామాన్యులనే గుర్తించి ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు.
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా..?
వర్ధన్నపేట మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పక్షాన బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే నిజమైన అభివృద్ధి ఎవరు చేశారో ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి చిత్తశుద్ధి ఉంటే పనికిరాని వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్. నాయకులు తమ వ్యాఖ్యలను ఆధారాలతో నిరూపించడానికి చర్చకు రావాలని యాకాంతం అన్నారు. మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలను వర్ధన్నపేట పట్టణ ప్రజలు నమ్మరని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగురేవేసి ఎమ్మెల్యే నాగరాజుకి కానుకగా ఇస్తామని యాకాంతం అన్నారు...