గూడూరు/జనవరి 22(జర్నలిస్ట్ వార్త);
మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఆదేశాల మేరకు గుండెంగ గ్రామం గోర్యబాల్య తండలో సిఎంఆర్, కళ్యాణ లక్ష్మి చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మామిడి రాజేశ్వరీ కుమార్తె సోని, మైదం అజీమా కుమార్తె గీతాంజలి కి కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో
గుండెంగ మాజీ సర్పంచ్ రవిశింగ్ రాథోడ్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.