గూడూరు/జనవరి22(జర్నలిస్ట్ వార్త);
కొద్దిరోజుల క్రితం హార్ట్ సమస్యల కారణంగా స్వర్గస్థులైన భీమ్లా నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబ సభ్యులను గూడూరు గ్రామ సర్పంచ్ వాంకుడోత్. సునీత కొమ్మలు నాయక్ పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి గుండెంగ మాజీ సర్పంచ్ రవిశింగ్ రాథోడ్ , దామోదర్, కాసోజ్ సతీష్, బోడ అశోక్ నాయక్, మండల్ స్థాయి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కలిసి భీమ్లా నాయక్ ఆత్మకు వందనాలు అర్పించి, శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. అనంతరం
సర్పంచ్ వాంకుడోత్.సునీత కొమ్మలు నాయక్ మాట్లాడుతూ భీమ్లా నాయక్ సేవలు గ్రామాభివృద్ధికి గొప్పగా నిలిచాయన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంట్లూ
తెలిపారు.