ధర్మసాగర్/జనవరి 22 హనుమకొండ బ్యూరో (జర్నలిస్ట్ వార్త);హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద రహదారి నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అధికారి ఆదేశాల మేరకు స్థానిక ఎస్ ఐ దిలీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న సమయంలో నీరు త్రాగడం, గుట్కా–పాన్ పరాగ్ నమలడం, ఒక చేత్తో సిగరెట్ పట్టుకొని స్టీరింగ్ తిప్పడం, మత్తు పానీయాలు సేవించడం, భద్రతా పట్టా ధరించకపోవడం, సంకేతాలను ఉల్లంఘించడం, అధిక లోడుతో వాహనాలు నడపడం, ముగ్గురు ప్రయాణించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటి చర్యలు ప్రమాదాలకు కారణమవుతాయని తెలిపారు.రహదారి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పోలీస్ శాఖకు సహకరించాలని, వాహనాలను జాగ్రత్తగా నడిపి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సహాయ ఉప పరిశీలకురాలు రమాదేవి, ప్రధాన కానిస్టేబుల్ సలీం పాషా, సాయిబాబా, కానిస్టేబుళ్లు రాజు, రాజేష్‌తో పాటు గ్రామస్తులు, వాహనచోదకులు పాల్గొన్నారు.
ధర్మసాగర్‌లో రహదారి నిబంధనలపై అవగాహన
By -
January 22, 2026