స్టేషన్ ఘన్పూర్/జనవరి22(జర్నలిస్ట్ వార్త): మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ముక్కెర రామ స్వామి ఇటీవల మృతిచెందడం జరిగింది. విష యం తెలుసుకున్న కంటెస్టెంట్ సర్పంచ్ చెవుల ఝాన్సీ రాకేష్ గురువారం మృతుడికుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ మీరు అధైర్యపడవద్దుమీ కుటుంబానికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానుఅని భరోసా ఇచ్చారు.బాధిత కుటుంబానికి తక్షణ సహాయం గా 50 కేజీల బియ్యం అందజేసి ఆర్థిక సహాయం చేశారు.కష్టసమయంలో సమాజంబాధిత కుటుం బానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈసందర్భంగా తెలిపారు.ఈకార్యక్రమంలో మాజీ ఉపసర్పంచులు గండి రాజు,ముక్కెర మహేందర్, పులిగిల్ల కుమారస్వామి, అశోక్, రమేష్, రామ చందర్, సంపత్, యాకరాజు, మెకానిక్ మహేష్, వెంకటయ్య, పాపయ్య, రాజు, భాస్కర్, నరేష్, లింగస్వామి, రాజేష్ రెడ్డి, సంతు, నాని, గండి రాజు, అనిల్, రాజేష్, నాగరాజు, యాకరాజు, కొమురయ్య పరామర్శించడం జరిగినది.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కంటెస్టెంట్ సర్పంచ్ చెవుల ఝాన్సీ రాకేష్
By -
January 22, 2026