తల్లాడ/జనవరి22(జర్నలిస్ట్ వార్త);
తల్లాడ మండల పరిధిలోని బిల్లుపాడు గ్రామపంచాయతీలో ఇటీవల వరుస మరణాలతో విషాదంలో ఉన్న కుటుంబాలను గ్రామ పెద్దలు పరామర్శించి ధైర్యం చెప్పారు. జెకె నగర్ కాలనీలో మృతి చెందిన పగిళ్ల జానకి పార్థివ దేహానికి సర్పంచ్ వెనీక కృష్ణవేణి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం డివి కాలనీలో మృతి చెందిన నారపోగు నరేష్ చిత్రపటానికి జక్కంపూడి కిషోర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారపోగు కుటుంబ సభ్యులను పరామర్శించి, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇక జెకె నగర్ కాలనీలో అనారోగ్య కారణాలతో మృతి చెందిన నల్లగట్ల రాముడు కుటుంబాన్ని గ్రామ పెద్దలు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ దుఃఖాన్ని అధిగమించేలా ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దలు సామినేని రామప్పరావు, జక్కంపూడి రమేష్, వె నీ క నరసింహారావు, ఆర్.ఎం.పి రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ బత్తుల రామదాసు, అల్లి బాబు, జక్కంపూడి అభిమానులు పాల్గొని మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు.
ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములుగా ఉంటామని, గ్రామ అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతను కొనసాగిస్తామని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు.