నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఘన నివాళులు

journalist vaartha
By -
సంగెం/జనవరి23(జర్నలిస్ట్ వార్త):
వరంగల్ జిల్లా సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామపంచాయతీ ఆవరణలో భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి సంగెం ఎస్‌ఐ వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కాగా 
,హైస్కూల్ హెడ్‌మాస్టర్ విజయ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గూడా స్వరూప–వీరస్వామి, ఉపసర్పంచ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నేతాజీ దేశభక్తి, త్యాగం, ధైర్య సాహసాలు యువతకు ఆదర్శమని వక్తలు కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.కార్యక్రమంలో మండల నాయకులు అనుముల కుమారస్వామి, మడత కేశవులు, గూడ రాజేందర్ రెడ్డి, అనుముల ఆదర్శ కుమారస్వామి, నీరటి కుమార్ స్వామి, వార్డు సభ్యులు అనుముల రాములు, కడుతూరి మల్లికార్జున్, పోశాల ప్రవీణ్, వేల్పుల ప్రశాంత్, లక్క సరిత నరేష్, గూడా అనుష కుమార్, కొనుకటి కమలాకర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వేల్పుల కుమారస్వామి, పరికి దయాకర్, గ్రామ నాయకులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొని నేతాజీకి ఘనంగా నివాళులు అర్పించారు.