మున్సిపల్ మేయర్ బర్రిలో డాక్టర్ కాపా చంద్రకళ పోటీకి సిద్ధం

journalist vaartha
By -
వైరా/జనవరి 22 (జర్నలిస్ట్ వార్త): వైరా పేద ప్రజలకు నిస్వార్థ వైద్య సేవలు అందిస్తూ సామాజిక సేవలో చురుగ్గా కొనసాగుతున్న డాక్టర్ కాపా చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే వైరా మున్సిపల్ మేయర్ బరిలో పోటీకి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.
గత కొన్ని సంవత్సరాలుగా లైన్స్ క్లబ్ ద్వారా పేద ప్రజలు, వికలాంగులకు అండగా సేవలందిస్తూ, కాపా మురళీకృష్ణ–చంద్రకళ జంట వైరా మండలంలో అభివృద్ధి, సమానత్వం, సేవల పరంగా ప్రత్యేక గుర్తింపు పొందారు.డాక్టర్ చంద్రకళ మాట్లాడుతూ, “ప్రజల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం. అవకాశమిస్తే, వైరా మున్సిపాలిటీని సమన్యాయ, అభివృద్ధి కేంద్రీకృతంగా ముందుకు తీసుకెళ్తాను” అని పేర్కొన్నారు. వైరా పరిసర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను ప్రాముఖ్యత ఇచ్చే విధంగా, ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తున్న ఆయన, మున్సిపల్ పోటీలో తన దూకుడు, అనుభవాన్ని ముందుకు తెచ్చే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.