వర్ధన్నపేటలో ఘనంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవంభారీ ర్యాలీ, మానవహారం… ఓటు హక్కుపై ప్రతిజ్ఞ

journalist vaartha
By -

వర్ధన్నపేట/జనవరి25 (జర్నలిస్ట్ వార్త):వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో శనివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ విజయ్ సాగర్ ఆధ్వర్యంలో. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య విలువలను చాటిచెప్పేలా సాగింది.కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని జాతీయ రహదారిపై అధికారులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు వేయాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సీనియర్ ఓటర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.  ఓటరు నమోదు, ఓటు అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న మైనారిటీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు (సర్టిఫికెట్లు) అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్, ఎస్ఐ సాయిబాబు, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.