వేలేరు హనుమకొండ బ్యూరో 24 జర్నలిస్ట్ వార్త);
సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లను పక్కాగా చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. జాతర నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.వేలేరు మండలం పీచర గ్రామంలో నిర్వహించనున్న మినీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంబంధిత శాఖల అధికారులు, స్థానిక సర్పంచులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యాలే ప్రథమ ప్రాధాన్యతగా అధికారులు పనిచేయాలని సూచించారు.జాతర స్పెషల్ ఆఫీసర్‌గా ఎంపీడీవో బాధ్యతలు చేపట్టి, జాతర జరిగే నాలుగు రోజుల పాటు నిరంతరం అందుబాటులో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి తగిన సిబ్బందిని నియమించాలని తెలిపారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, జాతర ప్రాంతంలో తక్షణమే లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.జాతర సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పేర్కొంటూ, అధికారులు, జాతర కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, రెవిన్యూ, పోలీస్ శాఖల అధికారులు, జాతర కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, సర్పంచులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.