ధర్మసాగర్ హనుమకొండ బ్యూరో 24 (జర్నలిస్ట్ వార్త);ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామానికి చెందిన మాదాసి నిర్మల ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలిపాక సురేష్ అధ్యక్షతన, బీఆర్‌ఎస్ నాయకుడు గుండవరం మాధవ్ రావు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంటెస్ట్ సర్పంచ్ బేరే దేవేందర్, బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు బేరే రూప కోటి, మాదాసి స్వాతి – ప్రశాంత్ పాల్గొని మృతురాలి కుటుంబానికి ధైర్యం చెప్పారు.
అలాగే కార్యక్రమంలో మాచర్ల రాజమ్మ, మాచర్ల ఐలయ్య, ధర్మసాగర్ మండల అధికార ప్రతినిధి బేరే మధుకర్, ఇంద కృష్ణ, మేడి జనార్ధన్, మేడి రమేష్, మాదాసి నవీన్‌బాబు, కొలిపాక రజినీకాంత్, చిలుక కిరణ్, మేడి రాములు, కనకం అనిల్, మాదాసి ప్రవీణ్, మేడి ఉప్పలయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.యువకులు మేడి వంశీ, కొలిపాక సన్నీ, కనకం హరీష్, కొలిపాక మున్నా, మేడి అన్వేష్ పాల్గొని సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు పార్టీ ఎల్లప్పుడూ ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటుందని తెలిపారు.