ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు బిర్రు మహేందర్ తండ్రి యాకయ్య కుటుంబాన్ని పరామర్శించిన మందకృష్ణ మాదిగ

journalist vaartha
By -

వర్ధన్నపేట /జనవరి 24( జర్నలిస్ట్ వార్త);వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం నల్లవెల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బిర్రు మహేందర్ మాదిగ తండ్రి బిర్రు యాకయ్య అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ యాకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ దుఃఖ సమయంలో ఎమ్మార్పీఎస్ ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.బిర్రు యాకయ్య మృతి ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్న మందకృష్ణ మాదిగ, మహేందర్ మాదిగ సేవలను కొనియాడుతూ, ఆయన కుటుంబానికి పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతాపం తెలిపారు.