వర్ధన్నపేట /జనవరి 24( జర్నలిస్ట్ వార్త);నల్లబెల్లి గ్రామంలో ఎంఆర్‌పీఎస్–ఎంఎస్‌పీ జిల్లా ఇంచార్జి బిర్రు మహేందర్ మాదిగ తండ్రి బిర్రు యాకయ్య అనారోగ్యంతో పరమపదించారు. వారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ సందర్భంగా యాకయ్య పార్ధివ దేహానికి పూలమాలలు వేసి పలువురు దళిత, సామాజిక నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొండేటి శ్రీనివాస్, జై భీమ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయల కుమార్, కొండూరు బాబు, ఎంఆర్‌పీఎస్ఎం ఎస్‌పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతుడికి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, బిర్రు యాకయ్య సాదాసీదా జీవితం గడుపుతూ కుటుంబానికి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.