నల్లబెల్లి/జనవరి 24 (జర్నలిస్ట్ వార్త):
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్–ఎంఎస్పి రాష్ట్ర నాయకులు, భువనగిరి జిల్లా ఇన్‌చార్జ్ బిర్రు మహేందర్ మాదిగ తండ్రి బిర్రు యాకయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శుక్రవారం వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ బిర్రు యాకయ్య గారి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు, ఇల్లంద మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు మన్నే బాబురావు, బిర్రు మౌనిక రాజు, జక్కి గోపాల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు తుల్ల రవి తదితరులు పాల్గొన్నారు.