బయ్యారంను నియోజకవర్గ కేంద్రంగా చేయాలి.జిల్లా మాజీ చైర్ పర్సన్ అంగోత్ బిందు. తహశీల్దార్ కు మెమోరాండం

journalist vaartha
By -

బయ్యారం/జనవరి 23,(జర్నలిస్ట్ వార్త);
బయ్యారం మండలం ను నియోజకవర్గం కేంద్రంగా చేయాలని మహబూబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కోదండరామ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ సాధన సమితి కన్వీనర్ చందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొని మాట్లాడుతూ, గార్ల, బయ్యారం ,గంగారం, కొత్తగూడ, మండలాలను కలుపుతూ బయ్యారం మండల కేంద్రంను నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు సమీప భవిష్యత్తులో పునర్విభజన జరిగితే బయ్యారంను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, మాజీలు ఎంపీపీ గుగులోతు కిషన్ నాయక్, ఎంపీటీసీ సనప సోమేష్, ఎనుగుల ఐలయ్య, తుమ్మల శ్రీనివాస్,మండలంలో ని గ్రామ సర్పంచులు, జగ్గు తండా ఉప సర్పంచ్ గుంజ వీరస్వామి, వార్డ్ మెంబర్లు సాధన కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం నాయకులు మండల తాహశీల్దార్ నాగరాజుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు నియోజకవర్గ ఏర్పాటుకు సహకరించాలని నాయకులు కోరారు.