ఫోటోగ్రఫీ పోటీలో బయ్యారం ఫోటోగ్రాఫర్ సందీప్ కు మొదటి బహుమతి.

journalist vaartha
By -

బయ్యారం/జనవరి 24 (జర్ణలిస్ట్ వార్త);
ప్రముఖ ఆర్ట్ ఫోటో గ్రాఫర్ 
పిల్లి సతీష్ జ్ఞాపకార్ధం లంబాడా జీవన విధానంపై జనవరి 22,23 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించారు.మన తెలంగాణ నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో ఫోటో గ్రాఫర్లు పాల్గొన్న ఈ పోటిల్లో బయ్యారం మండలానికి చెందిన సీనియర్ ఫోటో గ్రాఫర్ కేస సందీప్ మొదటి బహుమతి సాధించారు.ఆంధ్రప్రదేశ్ చీరాలకు చెందిన అరవింద్ రెండవ బహుమతి,సూర్యాపేట జిల్లా చెందిన శ్రీనివాస్ మూడవ బహుతి సాదించారు.ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ మహబూబాబాద్ జిల్లా అద్యక్షులు తోట సుభాష్,గౌరవ అద్యక్షులు దుంపేటి లక్ష్మణ్,ప్రధాన కార్యదర్శి కేస సందీప్,కోశాదికారి కడుదుల రవి,మానుకోట జిల్లా కుటుంబ భరోస ఇంచార్జ్ 
సింగంశెట్టి బాబురావు,మానుకోట పట్టణ అధ్యక్షులు షరీప్,
కార్యదర్శి వంశీ,కోశాదికారి రఘు,వర్క్ షాప్ నిర్వాహకులు ఎరబోయిన.శంకర,డప్పు యాని,
వర్క్ షాప్ న్యాయనిర్ణేతలు శ్రీనివాసచారి,నాగు,మెంటర్ సునీల్,
ఇతర ఫోటో గ్రాఫర్లు పాల్గొన్నారు.