బయ్యారం/జనవరి 24((జనవరి 24);
మండలంలోని ఇర్సులాపురం ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు డాక్టర్ బి.శోభన్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాగంగా విద్యార్థుల ద్వారా జాతీయ ఓటర్ దినోత్సవం ప్రతిజ్ఞను చేపించి,అనంతరం విద్యార్థులచే యువర్ ఓట్ యువర్ రైట్,ఓట్ ఫర్ ఫ్యూచర్ నినాదాలు చేపించి ఓటు విలువ గురించి వివరించినట్టు శోభన్ బాబు తెలిపారు.ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు శోభన్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో కుల,మత,వర్గ, వర్ణ,ప్రాంతీయ వివక్షత లేకుండా అందరికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు భారత రాజ్యాంగం కల్పించిదన్నారు.ఈ వార్డెన్ లాలయ్య,ఫీజికల్ డైరెక్టర్ వాలు,ఉపాధ్యాయులు హీరాసింగ్,శ్రీను,వీరు,రవి, కృష్ణవేణి,కాంతారావు,తులసి దాస్, అంజయ్య,వెంకటేశ్వర్లు,విద్యార్థులు పాల్గొన్నారు.