కలెక్టర్ సత్యశారదకు రాష్ట్రస్థాయి అవార్డుఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభకు ప్రభుత్వ గౌరవం

journalist vaartha
By -

వరంగల్ బ్యూరో/ జనవరి 25 (జర్నలిస్ట్ వార్త);వరంగల్ జిల్లా ఎన్నికల నిర్వహణలో విశేష ప్రతిభ కనబర్చిన జిల్లా కలెక్టర్ సత్యశారదకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి అవార్డు ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విజయవంతంగా నిర్వహించినందుకు ఈ గౌరవం దక్కింది.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ సత్యశారద ఈ అవార్డును స్వీకరించనున్నారు.ఎన్నికల సమయంలో ఓటర్లలో అవగాహన పెంపు, పోలింగ్ శాతం పెంచే దిశగా తీసుకున్న ప్రత్యేక చర్యలు, అధికార యంత్రాంగాన్ని సమర్థంగా సమన్వయం చేయడంలో కలెక్టర్ సత్యశారద చూపిన చొరవకు ప్రభుత్వం ఈ అవార్డు ద్వారా గుర్తింపు ఇచ్చింది.కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు రావడంపై జిల్లా అధికార వర్గాలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.