అకాల మృతి చెందిన గొల్లపల్లి మోహన్ కుటుంబానికి పూర్వ విద్యార్థుల సానుభూతి

journalist vaartha
By -

వర్ధన్నపేట /జనవరి 25(జర్నలిస్ట్ వార్త);వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో 1993–94విద్యాసంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఇటీవల అకాలంగా మృతి చెందిన గొల్లపల్లి మోహన్ కుటుంబాన్ని కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మోహన్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన వారు, ఆయన కుటుంబానికి ఈ దుఃఖ సమయంలో దేవుడు ధైర్యం, మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. మోహన్‌తో గల పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో జన్ను సునీత, డికొండ అమర్, శ్రీనివాస్, శ్రీధర్, మోహన్, రంగారావు, అజీజ్, ఘాయాస్, పాపారావు, లక్ష్మీనారాయణ, రాములు, బాబు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.