రేపు సీఎం కప్ 2025 క్రీడలు ప్రారంభం: ఎంపిడివో వీరేశం

journalist vaartha
By -
భీమదేవరపల్లి/జనవరి21 (జర్నలిస్ట్ వార్త): భీమదేవరపల్లి మండలంలో 22న గ్రామ పంచాయతీ స్థాయిలో సీఎం కప్ క్రీడలు జరుగుతాయని బుధవారం ఎంపిడివో వీరేశం తెలిపారు. అదేవిధంగా మండల స్థాయిలో 28 నుంచి 31వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండల స్థాయిలో 28న వాలీబాల్, అథ్లెటిక్స్ 29న కబడ్డీ, 30న ఖోఖో క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడల నిర్వహణకు భీమదేవరపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాట్లు చేసామన్నారు. మండలంలో ఆసక్తి గల యువతీ యువకులుపై క్రీడాంశాలలో పాల్గొనుటకు సంబంధిత పిఇటి వద్ద, ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకుని క్రీడలలో పాల్గొనాలని కోరారు.