జర్నలిస్టుల 2026 డైరీ ఆవిష్కరణ

journalist vaartha
By -
ధర్మసాగర్ /హనుమకొండ బ్యూరో జనవరి 23 (జర్నలిస్ట్ వార్త); టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో రూపొందించిన జర్నలిస్టుల 2026 డైరీని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం ఆవిష్కరించారు. హనుమకొండ సుబేదారిలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జర్నలిస్టుల డైరీ ఆవిష్కరణలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో యూనియన్ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర హౌసింగ్, వెల్ఫేర్ కన్వీనర్ వల్లాల వెంకటరమణ, జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, జిల్లా కార్యదర్శి తోట సుధాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ. వేణుమాధవ్, కంకనాల సంతోష్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, జిల్లా కోశాధికారి బచ్చు పురుషోత్తం, జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరి సాయిరాం, డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్, ఎంఏ. నయీం, జిల్లా కార్యవర్గ సభ్యులు పులికంటి రాజేందర్, అల్లె రామారావు, ఎంఎ. వాజీద్, తాళ్ల రవి, ఎండి. ఖాదర్ పాషా, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.