వర్ధన్నపేట/జనవరి23 (జర్నలిస్ట్ వార్త):
తెలంగాణ అంబేద్కర్ సంఘం వరంగల్ జిల్లా ఇంచార్జిగా వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామానికి చెందిన తాటికాయల వివేకానంద ను నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య స్వయంగా వివేకానందకు అందజేశారు.
తాటికాయల వివేకానంద గతంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా, జిల్లా కన్వీనర్‌గా వివిధ బాధ్యతలు నిర్వర్తించి సంఘ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ అంబేద్కర్ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆయనను జిల్లా ఇంచార్జిగా నియమించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం వరంగల్ జిల్లా కో-కన్వీనర్ జెంగిలి భాస్కర్, వర్ధన్నపేట మండల నాయకులు తుల్లా అనీల్, మరుపట్ల రమేష్, బోయిని రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.