సూర్యాపేట /జనవరి19(జర్నలిస్ట్ వార్త); తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సూర్యాపేట జిల్లా అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 23 జరుగనున్న జిల్లా నాల్గవ మహాసభను పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం తుంగతుర్తి, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా అడ్ హక్ కమిటీ కన్వీనర్ పాల్వాయి జానయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ... సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా టీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈనెల 23న జరగబోయే సూర్యాపేట జిల్లా నాలుగో మహాసభను జర్నలిస్టులందరూ విజయవంతం చేయాలని కోరారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటున్న వర్కింగ్ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అడ్ హక్ కమిటీ కో కన్వీనర్లు ముషం హరిప్రసాద్, శ్రీరాముల కృష్ణ, లింగాల సాయి గౌడ్, వంగాల వెంకన్న, నందిపాటి సైదులు, గూడపూరి ప్రభాకర్, తుంగతుర్తి మండల విలేకరులు ఎండి నజీర్, ఓరుగంటి శ్రీనివాస్, గుండగాని రామకృష్ణ , తడకమల్ల సురేష్, తడక మల్ల రమేష్, షేక్ జానీ, రమేష్, చిన్న లక్ష్మయ్య, శ్రీహరి, రహీము, ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 23న జరిగే టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా 4వ మహాసభను విజయవంతం చేయండి ముమ్మరంగా కొనసాగుతున్న సభ్యత్వ నమోదు
By -
January 19, 2026