రాష్ట్రస్థాయి థాంగ్ టా పోటీలకు బయ్యారం విద్యార్థుల ఎంపిక

journalist vaartha
By -
బయ్యారం/జనవరి 19(జర్నలిస్ట్ వార్త);
రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ థాంగ్ టా పోటీలకు బయ్యారం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం.ఆదిత్య ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయులు దేవేంద్ర చారి సోమవారం తెలిపారు.నవంబర్ 9న జరిగిన జిల్లా స్థాయిలో పోటిల్లో గోల్డ్ మెడల్ సాధించి ఈ నెల 19,20,21,తేదీలలో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ నెల్లికుదురులో నిర్వహించే థాంగ్ టా పోటీలలో మహబూబాబాద్ జిల్లా తరఫున ఆదిత్య పాల్గొంటారని ఎంఈఓ దేవేంద్ర చారి,పాఠశాల పీడి సునీత తెలిపారు.ఈ సందర్బంగా ఆదిత్యను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.