23న కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

journalist vaartha
By -
భీమదేవరపల్లి/జనవరి20 (జర్నలిస్ట్ వార్త): ఉత్తర తెలంగాణాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో ఈనెల18 వరకు జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాగా 23న జాతర ఉత్సవాల ఆదాయం లెక్కించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు హుండీ లెక్కించుటకు నిర్ణయించారు. ఆసక్తి గలవారు హుండీ లెక్కింపులో పాల్గొనవలసిందిగా ఆలయ ఇవో పి.కిషన్ రావు తెలిపారు.