రాయపర్తి/జనవరి20(జర్నలిస్ట్ వార్త):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రాయితీ పై రైతులకు వ్యవసాయ యాంత్రికరణ పరికరాలను అందిస్తుందని మండల వ్యసాయాధికారి గుమ్మడి వీరభద్రం అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణంలో ఏఈఓ లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తి గల రైతులు దరఖాస్తు ఫారం,పట్టా దారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జీరాక్స్, పాస్ ఫోటో, బ్యాంక్ పాస్ బుక్,ట్రాక్టర్ ఆర్ సి కార్డ్ జిరాక్స్ లతో ఈనెల 24 లోపు మండల వ్యయసాయ కార్యాలయంలో అందజేయాలని కోరారు.ఎస్సీ, ఎస్టీ , జనరల్ రైతులు మాత్రమె అర్హులు. ఎస్సీ ,ఎస్టీ రైతులకి 50% రాయతి జనరల్ రైతులకి 40% రాయితీని లభిస్తుందని అన్నారు.అర్హులైన ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
రాయితీ పై రైతులకు వ్యవసాయ పరికరాలు -మండల వ్యవసాయ అధికారి వీరభద్రం
By -
January 20, 2026