పరీక్షల ఒత్తిడి నిర్వహణతో ఉత్తమ ఫలితాలువిద్యార్థులకు డాక్టర్ ప్రహసిత్ కెరీర్ మార్గదర్శనం

journalist vaartha
By -
భీమదేవరపల్లి/జనవరి20 (జర్నలిస్ట్ వార్త): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీవీ రంగారావు బాలికల గురుకులంలో విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి నిర్వహణపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ ప్రహసిత్ కెరీర్ మార్గదర్శకత్వంపై కౌన్సెలింగ్ అందించారు. పరీక్షల సమయంలో ఎంతసేపు నిద్రపోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, చదివిన విషయాలు గుర్తుంచుకునేందుకు ఉపయోగపడే చిట్కాలు వివరించారు. పరీక్షలో ప్రశాంతంగా మంచి ప్రదర్శన ఎలా చేయాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఒత్తిడి తగ్గించుకునేందుకు శ్వాస వ్యాయామాలు చేయించారు. మంచి మార్కులు సాధించాలంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండు సమానంగా ముఖ్యమని తెలిపారు. అదేవిధంగా టెలీ మానస్ 14416 మానసిక ఆరోగ్య సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.