ధర్మసాగర్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా

journalist vaartha
By -

ధర్మసాగర్ /జనవరి 26 (జర్నలిస్ట్ వార్త)హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో శ్రీధర్ రావు, తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సదానందం, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అనిల్ కుమార్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని, దేశ అభివృద్ధి కోసం ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, గణతంత్ర విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ చేరేలా అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మండల స్థాయి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు