ధర్మసాగర్ ఎస్సీ కాలనీలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

journalist vaartha
By -
ధర్మసాగర్ /జనవరి 26( జర్నలిస్ట్ వార్త);హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టే సహకార సంఘం ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు కొట్టే ఏసేపు జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి విలువలను ప్రతి పౌరుడు ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొట్టే సహకార సంఘం సభ్యులు, స్థానిక పెద్దలు, యువకులు తదితరులు పాల్గొని జాతీయ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు