వర్ధన్నపేట /జనవరి 26 (జర్నలిస్ట్ వార్త);
వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రధాన కార్యాలయం ఇల్లందలో 77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, మార్కెట్ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న హమాలీలకు చైర్మన్ , పాలక వర్గ సభ్యులు ఏక రూప దుస్తులను (యూనిఫాం) అందజేశారు.
ఈ వేడుకలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సిరికొండ కృష్ణారెడ్డితో పాటు డైరెక్టర్లు కర్ర మాలతి రెడ్డి, ఎద్దు శ్రీనివాస్, బచు గంగాధర్ రావు, బండి సంపత్ గౌడ్, ఎం.డి. ఖాజమియా, ఎం.డి. మహమ్మద్, మల్యాల దేవేందర్, కిషన్ నాయక్, అల్లా కొమురయ్య పాల్గొన్నారు.