మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీ ఖాళీ.. ఎర్రబెల్లి సమక్షంలో గులాబీ గూటికి భారీ చేరికలు

journalist vaartha
By -
వర్ధన్నపేట/జనవరి26(జర్నలిస్ట్ వార్త);
వర్ధన్నపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గట్టి షాక్ తగిలింది. ఆయా పార్టీల తీరుపై అసంతృప్తితో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సుమారు 50 మందికి పైగా కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు.

సొంత గూటికి తుమ్మల రవీందర్..

ఈ చేరికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. రవీందర్ తో పాటు ప్రముఖ నాయకులు మంచు భారతి కూడా బిఆర్ఎస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరితో పాటు కాంగ్రెస్ నుండి తుమ్మల సామేల్, కానుగుర్తి సాయి, మేకల శ్రీనివాస్, దుబ్బాక సాయి గౌడ్ సహా 25 మంది, బీజేపీ నుండి భూక్య సుమన్ ఆధ్వర్యంలో 20 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోధుమల మధు సూదన్, మండల అధ్యక్షులు తూల్ల కుమారస్వామి, మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, మాజీ ఎంపిపి అప్పారావు, కుమారస్వామి, అమిజ్, రాజమణి, ఎండీ రహీం మరియు వివిధ వార్డుల అధ్యక్షులు, ఇంచార్జీలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు ప్రజాబలం లేదు..
 ఎర్రబెల్లి...

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ప్రజాబలం లేదని, ప్రజలంతా కేసీఆర్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. అభివృద్ధిని చూసే కార్యకర్తలు బిఆర్ఎస్‌లోకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.