బయ్యారం/ జనవరి 25 (జర్నలిస్ట్ వార్త);
మండలంలో బస్టాండ్ సెంటర్ రామాలయం సమీపంలోని ఇందిరమ్మ రాజ్యం లో ఇందిరమ్మ విగ్రహము రంగులు పేలిపోయి అంద వికారంగా దర్శనమివ్వడంతో సొంత పార్టీ నాయకులే ముక్కున వేలేసుకుంటూ చర్చించుకుంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ విగ్రహానికి రంగులు వేయలేదని, అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా.. విగ్రహానికి రంగులు దిద్దటం మరిచిన మండల నాయకులు. ఏదైనా కార్యక్రమం చేయాలంటే కార్యకర్తలు ముందుండి చేసే కార్యక్రమాలు అన్ని ఇన్ని కావు. భారత దేశంలో మాజీ ప్రధాని గా రెండుసార్లు పదవి చేపట్టి ఎన్నో సంస్కరణలు గావించిన గొప్ప మహా నాయకురాలు మండలంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలతో పార్టీ అత్యున్నత మహానీయులను కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనే ప్రచారం ఈ విగ్రహాలను చూసి పలువురు చర్చించుకుంటున్నారు..? కాంగ్రెస్ పాలనలో ఓ సారి రంగులైనా దిద్దరా...అనే విధంగా ఆర్త నాదంతో ఎదురు చూస్తుంది..ఇందిర గాంధీ విగ్రహం .