వర్ధన్నపేట/జనవరి25 (జర్నలిస్ట్ వార్త):
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి రాష్ట్ర నాయకుడు బిర్రు మహేందర్ తండ్రి బిర్రు యాకయ్య అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా
ఆదివారం ఎంజీఎఫ్ (జర్నలిస్టు విభాగం) ఉమ్మడి
వరంగల్ జిల్లా అధ్యక్షులు జోగుల కుమారస్వామి నల్లబెల్లి గ్రామాన్ని సందర్శించారు. మృతుడు యాకయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తీవ్ర దుఃఖంలో ఉన్న మహేందర్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్పు తెలిపారు. ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, యాకయ్య క్రమశిక్షణతో కూడిన జీవితం గడిపిన వ్యక్తి అని తెలిపారు. ఆయన మరణం కుటుంబానికి మాత్రమే కాకుండా గ్రామానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు. సామాజిక పోరాటాల్లో నిత్యం ముందుండే మహేందర్‌కు తండ్రిని కోల్పోవడం ఎంతో బాధాకరమని అన్నారు. యాకయ్య ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మృతుని బంధుమిత్రులు పాల్గొని తమ సానుభూతిని తెలిపారు. బాబు, ఎల్లయ్య, సుదర్శన్, దయాకర్, కొమురయ్య , స్వామి తదితరులు పాల్గొన్నారు