ధర్మసాగర్ / జనవరి 26 (జర్నలిస్ట్ వార్త):
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ గ్రామపంచాయతీ ఆవరణలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి–ఏలియా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ గ్రామాభివృద్ధికి అందరూ ఐక్యంగా పనిచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం దేశభక్తిని మరింత బలోపేతం చేసే పర్వదినమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది, యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా ధర్మసాగర్ గ్రామ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.