ఎల్కుర్తి గ్రామంలో ఎన్ఎస్‌ఎస్ సేవలు అభినందనీయం: సర్పంచ్ ఎన్. సుధాకర్

journalist vaartha
By -

ధర్మసాగర్/ జనవరి26 (జర్నలిస్ట్ వార్త):
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఎల్కుర్తి గ్రామంలో ఎన్ఎస్‌ఎస్ ద్వారా విద్యార్థులు గ్రామానికి సేవలు చేయడం అభినందనీయమని గ్రామ సర్పంచ్ ఎన్. సుధాకర్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్‌ఎస్ శీతాకాల ప్రత్యేక ఏడు రోజుల శిబిరం సోమవారం ఎల్కుర్తి గ్రామంలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకురాలు కే.ఎం. సరిత అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాన్ని ఎంపిక చేసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామంలో సామాజిక చైతన్య కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. శిబిరంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించి గ్రామంలోని అక్షరాస్యత, నిరక్షరాస్యుల శాతాన్ని గుర్తించాలని, గ్రామాభివృద్ధికి ఎన్ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలు ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్. రాజ్ కుమార్, యూపీఎస్ హెచ్‌ఎం మాధవి, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎస్. ధర్మేంద్ర, కళాశాల అధ్యాపకులు ఎం. రేవతి, జి. విజయ చందర్‌తో పాటు గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఎన్ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.