వర్ధన్నపేట/జనవరి 26 (జర్నలిస్ట్ వార్త):
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్ధన్నపేట పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే అత్యంత గొప్పదని, ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కల్పించడమే దాని ముఖ్య ఉద్దేశమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు అవగాహన చేసుకోవాలని సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు, పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.