ఆసుపత్రిలో ఘనంగా గణతంత్ర దినోత్సవంజెండా ఎగురవేసిన సూపర్డెంట్ డాక్టర్ నరసింహస్వామి

journalist vaartha
By -
వర్ధన్నపేట/జనవరి 26 (జర్నలిస్ట్ వార్త):
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో సూపర్డెంట్ డాక్టర్ నరసింహస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి హక్కులతో పాటు బాధ్యతలను, కల్పించిందని తెలిపారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని వైద్యులు, సిబ్బందిని కోరారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆసుపత్రి ఉద్యోగులు పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.