గట్టు ప్రసాద్ బాబు మృతి టీడీపీకి తీరని లోటు

journalist vaartha
By -

ధర్మసాగర్/జనవరి 26 (హనుమకొండ బ్యూరో – జర్నలిస్ట్ వార్త):
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీగా సేవలందించిన క్రీ.శే. గట్టు ప్రసాద్ బాబు సోమవారం ఉదయం 5 గంటలకు తన స్వగృహంలో కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
గట్టు ప్రసాద్ బాబు తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, కూడు చైర్మన్‌గా, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా, అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా వివిధ హోదాల్లో పార్టీకి అపార సేవలందించారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లి పరిస్థితులను అధ్యయనం చేసి పార్టీకి నివేదిక సమర్పించిన బాధ్యతాయుత నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయి.గట్టు ప్రసాద్ బాబు పార్థివ దేహంపై తెలుగుదేశం పార్టీ జెండాను కప్పి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ పుట్ట రజినీకాంత్‌తో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.