హనుమకొండ/జనవరి 26 (జర్నలిస్ట్ వార్త);
గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రోటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో అధ్యక్షుడు వేముల నాగరాజు జాతీయజెండా ఆవిష్కరించిన అనంతరం కార్యక్రమానికి హజరైన జర్నలిస్టులు జాతీయగీతాలాపన చేశారు. ముందుగా రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి వేముల నాగరాజు, బొల్లారం సదయ్య, బోల్ల అమర్ లు పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ క్లబ్ అభివృద్ధి విషయంలో ఎన్ని ఒత్తిడిలు వచ్చినా తగ్గేదే లేదని చెప్పారు. ఎన్పీడీసీఎల్ సహాయంతో వెనకవైపు కాంపౌండ్ వాల్, ముందు వైపు, ఉత్తరంవైపు ప్రహరీ గోడ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నిధులతో నిర్మించుకున్నామని అన్నారు. క్లబ్ కాంపౌండ్ లోపల సీసీ, గ్రీనరీని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గుండు సుధారాణి సహకారంతో నెలరోజుల్లో పూర్తి చేయనున్నామని తెలిపారు. క్లబ్ నిధులను ఒక్కపైసా ఖర్చు చేయకుండా దాదాపు 50 లక్షల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేశామని, చేస్తున్నామని చెప్పిన వేముల జర్నలిస్టుల చిరకాల కోరిక నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి గౌరవ సభ్యులకు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. మీడియా అకాడమీ ఛైర్మన్ కే శ్రీనివాస రెడ్డి, టీయూడబ్ల్యూజే ,ఐజేయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు విరహత్ అలీ, రాంనారాయణ, రాష్ట్ర హౌసింగ్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ వల్లాల వెంకటరమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, హన్మకొండ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, పూర్వ అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, వివిధ హోదాల్లో ఉన్న వివిధ యూనియన్ల నేతలందరితో కలసి ఈ చారిత్రక కార్యక్రమం చేపట్టనున్నమని ప్రకటించారు.
ఇంతటి కార్యక్రమానికి పూనుకున్న సందర్భంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అదేసమయంలో తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం కలిగిన 200 నుండి 250 మంది జర్నలిస్టులకు మొదటి విడతలో ఇంటిస్థలాలను అందిస్తామని, వచ్చేనెల 14వ తేదీ నుండి మొదటి వాయిదీ చెల్లింపునకు రెడీగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టుల నేతలు ప్రెస్ క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు.
ఘనంగా నాగరాజు జన్మదిన వేడుకలు
క్లబ్ ఆవరణలో ఘనంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు జన్మదిన వేడుకలు. పెద్దఎత్తున హజరైన జర్నలిస్టులు.కేకే కట్ చేయించి, గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో నేతలు గాడిపెల్లి మధు, గడ్డం రాజిరెడ్డి,తోట సుధాకర్, గడ్డం కేశవమూర్తి,నల్లాల బుచ్చిరెడ్డి, బొల్లారం సదయ్య, బోల్ల అమర్, గోకారపు శ్యాం, బొడిగె శ్రీను,అల్లం రాజేష్ వర్మ,యంసాని శ్రీనివాస్,పొడిచెట్టి విష్ణువర్ధన్,వలిశెట్టి సుధాకర్,శ్రీకాంత్, నయీంపాషా,దిలీప్,మంచాల రాజు, అడుప సాంబశివరావు,కిరణ్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, వెంకట్, యువరాజు,రమేష్ తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.