గణతంత్ర వేడుకల్లో మెరిసిన దేశభక్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పతాకావిష్కరణరాజ్యాంగ స్ఫూర్తితోనే అభివృద్ధి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

journalist vaartha
By -

వర్ధన్నపేట/జనవరి 26(జర్నలిస్ట్ వార్త);
77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలో అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం వల్లే దేశం పురోగమిస్తోందని అన్నారు.సామాజిక బాధ్యత: ప్రతి కార్యకర్త, నాయకుడు సామాజిక బాధ్యతతో పనిచేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని కోరారు. విద్యార్థులు, యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని సూచించారు.
నియోజకవర్గ అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో  సీనియర్ అడ్వకేట్ శేఖర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్తన్న, పోశాల వెంకన్న, జిల్లా నాయకులు సాయికుమార్, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మహిళ సంఘం నాయకులు,ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు
 పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.