భీమదేవరపల్లి/జనవరి22 (జర్నలిస్ట్ వార్త): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ సమ్మక్క సారక్క ఆలయ చైర్మన్‌గా జక్కుల ఐలయ్యను నియమిస్తూ దేవదాయ ధర్మదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ జక్కుల ఐలయ్య మాట్లాడుతూ, తనపై నమ్మకంతో తనను జాతర చైర్మన్‌గా నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీలోని సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు సహా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధికి, మొబైల్ బాత్రూముల ఏర్పాటు, ఆలయ మరమ్మత్తులకు సహకరిస్తున్న మంత్రివర్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్లుగా గీకురు ఐలయ్య, మాడుగుల యాదగిరి, గుడి కందుల రాజు, పెంచికల జైపాల్, వంగ శ్రీనివాస్ గౌడ్, కుదురుపాక శ్రీనివాస్, పెంటపుర్తి వీరారెడ్డి, మారుపాటి శ్రీనివాస్ రెడ్డి, మద్ది వేణుగోపాల్, మాలోతు మొగిలి, చిదురాల విజయ రెడ్డి, ఎలుకపల్లి రామారావు, మాడుగుల మధుకర్ నియమితులయ్యారు. ముల్కనూర్ గ్రామ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి గారి సహకారంతో, తన చైర్మన్ పదవీకాలంలో రాబోయే సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భద్రత, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వసతులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ముల్కనూర్ సమ్మక్క సారక్క ఆలయ చైర్మన్‌గా జక్కుల ఐలయ్య
By -
January 22, 2026