వాహనదారుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం.-గార్ల బయ్యారం సీఐ రవీందర్.

journalist vaartha
By -

బయ్యారం/జనవరి 22 (జర్నలిస్ట్ వార్త);
రోడ్డు ప్రమాదాలను తగ్గించి వాహనదారుల సురక్షిత ప్రయాణాలను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గార్ల బయ్యారం సీఐ రవీందర్ తెలిపారు.జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశానుసారం గురువారం మండల లారీ అసోసియేషన్ వద్ద అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ లో భాగంగా గార్ల బయ్యారం సీఐ ఎల్.రవీందర్ పాల్గొని వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలను వివరించి మండలంలో గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాలు గురించి వివరిస్తూ దానికి గల కారణాలను వివరించారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ ధరించాలని మద్యం తాగి వాహనాలు నడపరాదని నిర్లక్ష్యంగా అతివేగంగా వాహనాల నడపరాదని మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకూడదని సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని ఓవర్ లోడ్ వాహనాలను నడపారాదని సూచించారు.ఈ కార్యక్రమంలో బయ్యారం ఎస్సై కే. తిరుపతి,బయ్యారం పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.