బయ్యారం/జనవరి 22, (జర్నలిస్ట్ వార్త);
మండలంలో ఆర్ అండ్ బి రోడ్లు శిథిలమైన వాటిని పునరుద్ధరించాలని, బయ్యారం గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులో శాంతి కిషన్ నాయక్ గురువారం మహబూబాబాద్ ఆర్ అండ్ బి శాఖ ఈఈ భీమ్లా నాయక్ వారి కార్యాలయంలో కలిసి మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బయ్యారం సర్పంచ్ మండలంలో ఆర్ అండ్ బి రోడ్లు బస్టాండ్ సెంటర్ నుండి శోక్లా తండా బిటి రోడ్డు నిర్మాణం త్వరితగరితిన,పనులు పూర్తి చేయాలని,బయ్యారం గ్రామపంచాయతీలో రోడ్ల పై ప్యాచ్ వర్క్ పూర్తి అయిన పనులను పరిశీలించాలని, బయ్యారం మండల కేంద్రంలో శ్రీ కోదండరామ ఆలయ ఫంక్షన్ హాల్ అరొకొర సదుపాయాలు కలిగి ఉన్న నేపథ్యంలో, వాటికి ఫండ్ ను సమకూర్చి అభివృద్ధి పదంలో తీసుక వెళ్లేందుకు మీ వంతు కృషిచేసి దానికి కావలసిన ఎస్టిమేట్ వివరాలను ఇవ్వాలని కోరారు. దానికి స్పందించిన ఆర్ అండ్ బి ఈ బయ్యారం రామాలయ ఫంక్షన్ హాల్ను సందర్శించి రామాలయ కమిటీ నిర్వాహకులతో కలిసి మాట్లాడినట్లు తెలిపారు.ఫంక్షనాలు కావలసిన అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాఆలయ కమిటీ అధ్యక్షుడు గాదె కృష్ణారెడ్డి కార్యదర్శి కొల్ల వెంకటేశ్వరరావు , పెద్దిండి వెంకటేశ్వరరావు పుట్టకొండ సత్తిబాబు, ఎల్లావుల మల్లయ్య,కోటి, తదితరులు పాల్గొన్నారు.