నర్సంపేట గడ్డపై కాషాయం జెండా ఎగరడం కాయంభారతీయ జనతా పార్టీతోనే సాధ్యం - రాణా ప్రతాప్ రెడ్డి

journalist vaartha
By -
నర్సంపేట/జనవరి22 (జర్నలిస్ట్ వార్త);
నర్సంపేట మున్సిపాలిటీలోని 1వ వార్డు మాధన్నపేటలో కేంద్ర ప్రభుత్వ పతకాలకు ఆకర్షితులై పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన దొంతరబోయిన రమేష్ ఆధ్వర్యంలో మాధన్నపేట నుండి 25 కుటుంబాలు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ లోకి చేరడం జరిగింది.ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతు ప్రజలందరూ కూడా గత 12 సంవత్సరాలుగా ప్రియతమ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సుపరిపాలనకు ఆకర్షితులై కాషాయ పార్టీ కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీ లోకి చేరడం జరిగింది. మాధన్నపేటలో పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటికలో, డంపింగ్ యార్డ్, సి.సి రోడ్లు, విధి దీపాలు, రైతు వేదిక, ఉజ్వల పథకం కింద ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ మరియు అనేక రకాల పథకాలు అమలు చేసి బడుగు బలహీన వర్గాల అభివృధి కోసం కృషి చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని చూసి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని తెలియచేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి నర్సంపేట గడ్డ మీద కాషాయ జెండా ఎగురవేయలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్రా రెడ్డి, రూరల్ అధ్యక్షులు తనుగులు అంబేద్కర్, బిజెపి సీనియర్ నాయకులు కుంభం కోమల్ రెడ్డి, సుంకరి రవీందర్ రెడ్డి, జూలూరి మనీష్ గౌడ్,మాజీ ఎంపీటీసీ భాష బోయిన రాజు, మండల నాయకులు జరుపుల వీర్రాన్న జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిళ్ల రామచందర్, యువ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు కొంకిస విఘ్నేష్ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ కోమండ్ల సప్తగిరి, యువ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు పల్లంకొండ శ్రీను, నూనె రంజిత్, రూరల్ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాము, గంధం రాజు, పట్టణ ఉపాధ్యక్షులు కందగట్ల నాగరాజు, కాసుల నాగేంద్ర బాబు, ఠాకూర్ విజయ్ సింగ్, వరంగటి రాజు కుమార్, కార్యదర్శులు చేను నరేష్, అశోక్, యువమోర్చా నాయకులు తప్పెట్ల సతీష్, అల్లం నిఖిల్ పటేల్, పుప్పాల కళ్యాణ్ మరియు జిల్లా నాయకులు పట్టణ నాయకులు యువమోర్చా నాయకులు బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.