వీధి కుక్కలకు వింత రోగం..భయాందోళనలో స్థానికులు.

journalist vaartha
By -

బయ్యారం/జనవరి 22(జర్నలిస్ట్ వార్త);
బయ్యారం మండలంలో వీధి కుక్కలకు వింత రోగం సోకిందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.మండల కేంద్రంలో ఏ వీధికి వెళ్లిన కుక్కలకు చర్మం ఊడి, నల్లటి, ఎర్రటి మచ్చలతో దర్శనమిస్తున్నాయి.దద్దుర్లు లేచి దురదతో కుక్కలకు పుండ్లు, నీరు కారడంతో ఈగలు, దోమలు వాలి ఇండ్లలోకి వస్తున్నాయని, కుక్కలకు సోకిన ఎలర్జీ చర్మ రోగం మనుషులకు సోకే ప్రమాదం ఉందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
మండల కేంద్రంతో పాటు గ్రామాలలో ప్రజలు నిర్వహిస్తున్న విందులు, వినోదాలు, పలు శుభకార్యాల వద్ద కుళ్ళిన మిగులు వ్యర్థలు తిని వ్యాధుల బారిన పడుతున్నాయి.అలాగే మండల కేంద్రంలో పారిశుధ్యం శానిటేషన్ పనులు గ్రామ పంచాయతీ అధికారులు పారిశుధ్యం, శానిటేషన్ పై ప్రత్యేక చొరవ చూపాలని, కుక్కలకు పశు వైద్య అధికారుల సూచనలు సలహాలతో నివారణ చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యం కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.