యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దువంగర పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ జి.దివ్య

journalist vaartha
By -

భీమదేవరపల్లి/జనవరి22 (జర్నలిస్ట్ వార్త): వరంగల్ నగర పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు గురువారం జాగృతి పోలీస్ కళా బృందం అవగాహన కార్యకమం నిర్వహించారు. భీమదేవరపల్లి మండలం వంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని డా.పీవీ రంగారావు బాలికల గురుకులంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ దివ్య హాజరై మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దని, ఆడ పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా వుండాలని సూచించారు. చదువుపై దృష్టి పెట్టాలని, సైబర్ మోసాల బారిన పడవద్దని, రోడ్డు ప్రమాదాలు, డయల్100, షీ టీమ్స్, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, భరోసా వంటి అంశాలను వివరించారు. తల్లితండ్రులు చెప్పిన మాట వినాలని, సైబర్ మోసాలకు గురైతే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి ఫోన్ చేయాలని చెప్పినారు, పలు సామాజిక అంశాలపై పోలీస్ జాగృతి కళా బృందం వారు ఆలపించిన పాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసాయి. ఈ కార్యక్రమానికి గురుకులం ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ ఆఫీసర్స్,కళా బృందం ఇంచార్జి ఉమెన్ ఎఎస్ఐ నాగమణి, సభ్యులు, హెడ్ కానిస్టేబుల్స్, విలియమ్, వెంకటేశ్వర్లు, రత్నయ్య, పోలీసు కానిస్టేబుల్ పూల్ సింగ్, హోమ్ గార్డ్స్, కాలేజ్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.